Kamaal R Khan: “నేను ఆత్మ‌హ‌త్య చేసుకుంటే న‌మ్మ‌కండి”

Kamaal R Khan: బాలీవుడ్ వివాదాస్ప‌ద నిర్మాత‌, సినీ విమ‌ర్శ‌కుడు క‌మ‌ల్ ఆర్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ స‌మ‌యంలో క‌మ‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక‌వేళ తాను ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డితే అది ఆత్మ‌హ‌త్య అని ఎవ్వ‌రూ న‌మ్మొద్ద‌ని చంపేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు క్రియేట్ చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. 2016కు సంబంధించిన కేసులో భాగంగా క‌మ‌ల్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. టైగ‌ర్ 3 (tiger 3) సినిమా త‌న వ‌ల్లే ఫ్లాప్ అయింద‌ని స‌ల్మాన్ (salman khan) ఆరోపిస్తున్నార‌ని.. జైల్లో త‌న‌ను స‌ల్మాన్ చంపేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు.