Ketika: ‘బయోపిక్‌లో నటించడం నా డ్రీమ్!’
టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న హాట్ బ్యూటీ కేతికా శర్మ. అందాల ఆరబోతలో కేతిక ఏమాత్రం తగ్గకపోయినా అవకాశాలు మాత్రం అంతగా అందుకోలేకపోతోంది. పూరీజగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ఢిల్లీ భామ. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా, కేతికకి యూత్ లో మంచి కేజ్ ని తెచ్చి పెట్టింది. ఈ మూవీ తరువాత నాగశౌర్య – లక్ష్య, వైష్ణవ తేజ్ – రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించింది.
ఈ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ప్రస్తుతం ఈ భామ ఏ సినిమాలో నటించడం లేదు. కాగా ఈ భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జయాపజయాల, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఒక సినిమా ఓకే చేసిన తరువాత అది హిట్ అవుతుందా? లేదా? అనేది నేను ఆలోచించాను. ఒక నటిగా నేను ఆ మూవీకి ఏమి చేయగలను అనే నా పని మాత్రమే చూస్తాను. అయితే ఆ సినిమా రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. మంచి కథ దొరికితే త్వరలో ఒక సినిమాతో మీ ముందుకు వస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కేతిక.
ఇక తాను రొమాంటిక్ వంటి యూత్‌ఫుల్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా తనకి మాత్రం సకుటుంబంగా చూసే సినిమాల్లో నటించడమే తనకి ఇష్టమంటోంది కేతిక. అంతేకాదు మంచి బయోపిక్ నటించాలనేది తన డ్రీమ్ అని, అలాంటి కథ ఏదైనా వస్తే బాగుండని.. తన కోరికను తెలియజేసింది. ఇటీవల వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలియజేసిన కేతిక.. స్క్రిప్ట్ నచ్చితే వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తాను అంటోంది. అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కుర్రకారుకి పిచ్చెక్కించే ఈ భామ సినిమాలతో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతోంది. మరి రాబోయే ప్రాజెక్టుల్లో అయినా ఈ ఉత్తరాది భామ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.