Siddharth: పెళ్లి జరగలేదు.. సన్నిహితులు ఏం చెప్పారు?
Siddharth: నటుడు సిద్ధార్థ్.. బాలీవుడ్ నటి అదితి రావు హైదరిని (Aditi Rao Hydari) వనపర్తిలో రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. వనపర్తిలోని శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం స్నేహితులు, సన్నిహితుల మధ్య జరిగిందని అంటున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సిద్ధార్థ్ సన్నిహితులు తెలిపారు. సిద్దార్థ్ ఆలయానికి వెళ్లిన మాట నిజమే కానీ తన కుటుంబంలోని వారు పూజ చేయడానికి వెళ్తే ఆ పూజలో పాల్గొనేందుకు వెళ్లారని పేర్కొన్నారు. ఈ పూజలో అదితి కూడా పాల్గొనడంతో పెళ్లైనట్లు వదంతులు పుట్టించారని అన్నారు.