Aamir Khan: చెన్నైకి మ‌కాం మార్చ‌నున్న ఆమిర్

బాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ (aamir khan) త‌న మ‌కాంను ముంబై (mumbai) నుంచి చెన్నై (chennai) మార్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో త‌న త‌ల్లి జీన‌త్ హుస్సేన్‌తో క‌లిసి ఉంటున్నారు. అయితే కేవ‌లం రెండు నెల‌ల కోస‌మే ఆయ‌న చెన్నైలో ఇల్లు తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమిర్ త‌ల్లి జీన‌త్ హుస్సేన్ కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె చెన్నైలోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోస‌మే ఆమిర్ చెన్నైలో ఇల్లు ఖ‌రీదు చేసిన‌ట్లు స‌మాచారం. (aamir khan moving to chennai)