Michaung: తుఫానులో చిక్కుకున్న ఆమిర్ ఖాన్, విష్ణు విశాల్

Michaung: త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను మిగ్‌జాం తుఫాను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో NDRF బృందం తుఫాను కార‌ణంగా వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్ (aamir khan), త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ల‌ను (vishnu vishal) ర‌క్షించారు. ఆమిర్ ఖాన్ త‌ల్లి అనారోగ్యంతో చెన్నైలోని హాస్పిట‌ల్‌లో చేర్చారు. ఆమె కోసం ఆమిర్ చెన్నైలోని క‌ర‌ప్పాకం అనే ప్రాంతంలో ఇల్లు తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇదే ప్రాంతంలో న‌టుడు విష్ణు విశాల్ కూడా ఉండ‌టంతో NDRF బృందం వెంట‌నే వ‌చ్చి వారిని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.