Virushka: విరాట్, అనుష్క పార్టీలో అనుకోని అతిథి.. అంద‌రి చూపు అత‌ని వైపే!

Virushka: విరాట్ కోహ్లీ (virat kohli), అనుష్క శ‌ర్మ (anushka sharma) దంప‌తులు నిన్న త‌మ ఆరో మ్యారేజ్ యానివ‌ర్స‌రీని జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ఫ్రెండ్స్‌తో క‌లిసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అయితే పార్టీకి వచ్చిన వారిలో ఒక వ్య‌క్తి అనుకోకుండా ప్ర‌త్య‌క్ష‌మై అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసారు. అనుష్క విరాట్‌ల కంటే ఆ వ్య‌క్తి గురించే అంద‌రూ మాట్లాడుకుంటున్నారు.

ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రంటే.. అభిషేక్ ఉప‌మ‌న్యు (abhishek upmanyu). ఈ వ్య‌క్తి గురించి మ‌న తెలుగు వారికి పెద్ద‌గా తెలీక‌పోవ‌చ్చు. ఇత‌ను చాలా ఫేమ‌స్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్. ఇత‌నికి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనుష్క‌, విరాట్‌ల‌కు క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎంత ఫేమ‌సో అర్థం చేసుకోండి. ఇత‌ని సంపాద‌న కూడా లక్ష‌ల్లోనే ఉంటుంది. అంటే ఎంతో పెద్ద హిట్ అయితే తప్ప ఒక స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌కు ల‌క్ష‌ల్లో పేమెంట్స్ ఇవ్వ‌రు.