Salaar నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సలార్’(Salaar). కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో ముందునుంచే ఈ సినిమా మీద భారీ అంచానాలు ఉన్నాయి. అందులోనూ బాహుబలి(Bahubali)తో పాన్ ఇండియా స్టార్​గా మారిన ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానులతోపాటు సినీవర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుంచీ ఏ అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందకు రెడీ అవుతున్నారు మేకర్స్.

సలార్ సినిమా ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్2కి ఇది సీక్వెల్గా వస్తుందంటూ వచ్చిన వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా భిన్నమైన కథతో తెరకెక్కనుందని, కేజీఎఫ్ కథతో సంబంధం లేదని చెప్పారు. ఇక, తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యశ్(Yash) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు ముగించేసి, ఓ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని చిత్ర యూనిట్ చూస్తోంది.ఈ నెల చివరిలో లేదా మే తొలి వారంలో సలార్ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్. మరి నిజంగానే సలార్ నుండి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్(Shruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తోండగా, హొంబలే ఫిలింస్ సలార్​ను నిర్మిస్తోంది.