Anupama Parameswaran: ఇలా చేస్తారనుకోదు.. అభిమాని ఆవేదన
Anupama Parameswaran: నటి అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ఆమె చేసిన సినిమాలను కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయి. అలా అనుపమ రౌడీ బాయ్స్ (Rowdy boys) సినిమాతో తనలో గ్లామర్ డాల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. దాంతో మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్వ్కేర్ ట్రైలర్లో అనుపమ.. హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఘాటుగా ముద్దులు పెడుతూ హీట్ పెంచేసారు. సినిమాలో ఇలాంటివి చాలా సన్నివేశాలే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అనుపమ ఇలాంటి హాట్ సీన్స్ ఉండే సినిమాల్లో నటించడంపై ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేసాడు. ఒకప్పుడు సావిత్రి, సౌందర్యలు హుందాగా ఉండే సినిమాలు చేసేవారని ఇప్పుడు వారి స్థానంలో అనుపమను ఊహించుకుంటున్నామని అన్నాడు. అలాంటి అనుపమ ఇలాంటి సన్నివేశాల్లో నటించడం చూస్తుంటే బాధగా ఉందని.. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా ఉండే సినిమాల్లో నటిస్తేనే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి దీనిపై అనుపమ ఏమంటుందో వేచి చూడాలి.
ఏవండీ అనుపమ గారూ.. మీ ఫోటోని నేను నా ఆటో వెనుక ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఒకప్పుడు మీరు చేసిన సినిమాలు అలాంటివండీ. ఆ సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడనివారు ఉంటారా? శతమానం భవతి సినిమాలో అసలు మరదలు అంటా ఇలా ఉండాలి అనేలా చేసారు. శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే..ఎలాంటి మంచి సినిమాలు చేసారండీ. హలో గురు ప్రేమ కోసమే సినిమాలో కాఫీ సీన్లో ఉన్నది మీరేనా కాదా అని మేమే కన్ఫ్యూజ్ అయిపోయాం.
అలాంటి మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండీ..! రౌడీ బాయ్స్, టిల్లు స్వ్కేర్.. ఎందుకండీ మీరు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు? ఒకప్పుడు సావిత్రి, సౌందర్య గారు ఎలాంటి సినిమాలు చేసారండీ..! వాళ్లలాగే మిమ్మల్నీ అనుకున్నాం. మీరు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం మాకేం నచ్చట్లేదండీ. ఒక అభిమానిగా చెప్తున్నాను. దయచేసి మంచి మంచి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేయండి. ప్లీజ్ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసాడు.
ఆ అభిమాని బాధలో ఓ అర్థం ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో చక్కని సినిమాలు చేసారు. ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ అనేది లేకుండా సంప్రదాయమైన దుస్తుల్లోనే కనిపించారు. మోడ్రన్ దుస్తులు వేసినా చూసేలా ఉండేవి. కానీ రౌడీ బాయ్స్ సినిమాతో అనుపమ ఫ్యాన్స్ షాకయ్యారు. ఎలాంటి సినిమాలు చేసేవారు ఎలాంటివి చేస్తున్నారు అని అనుకుంటూ బాధపడేవారు కొందరైతే.. అనుపమలో ఇలాంటి యాంగిల్ చూడాలనుకుంటున్నవారు మరికొందరు.
కానీ ఇండస్ట్రీలో నేను ఒకే రకమైన క్యారెక్టర్లలో నటిస్తాను అంటే కుదరదు కదా..! కథ నచ్చినప్పుడు అన్నీ చేయాల్సి ఉంటుంది. రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విషయం చర్చకు వచ్చింది. రౌడీ బాయ్స్ ప్రెస్ మీట్ సమయంలో మీడియా వర్గాలు ముద్దు సీన్లకు సంబంధించిన అంశాలే అడుగుతారని అనుపమ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఓ నటిగా తన పని తాను చేసానని.. ఎవ్వరికీ కూడా ఇలాంటి సీన్లలో నటించడం ఇష్టం ఉండదని తనని తాను సమర్ధించుకున్నారు. రౌడీ బాయ్స్ సినిమాలో కొన్ని సీన్లలో స్క్రిప్ట్ ముద్దులను డిమాండ్ చేసింది కాబట్టే చేసానని..స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని అన్నారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అనుపమ గ్లామరస్ రోల్స్‌లో నటించడం లేదు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించడంతో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయట. కాస్త గ్లామరస్ రోల్స్‌ని కూడా ఓకే చేస్తే.. అప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అనుపమ అభిప్రాయపడుతోంది.