Krishna Vamsi: ప్ర‌భాస్‌తో సినిమా ఎందుకు తీయ‌లేదు?

a fan asks krishna vamsi why did not he make a movie with prabhas

Krishna Vamsi: ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకి ఓ అభిమాని నుంచి వింత ప్ర‌శ్న ఎదురైంది. ఆ ప్ర‌శ్న చ‌దివాక పాపం కృష్ణ‌వంశీకి న‌వ్వాలో ఏడ‌వాలో అర్థంకాలేదు. కృష్ణ‌వంశీ తీసిన బ్లాక్ బ‌స్టర్ సినిమా మురారి మొన్న ఆగ‌స్ట్ 9న రీరిలీజ్ అయ్యి మ‌ళ్లీ రికార్డులు సృష్టించింది. ఈ నేప‌థ్యంలో అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు కృష్ణ‌వంశీ ట్విట‌ర్‌లో ఓపిగ్గా స‌మాధానాలు ఇస్తున్నారు.

అయితే.. ఓ ప్ర‌భాస్ అభిమాని కృష్ణ‌వంశీని ఓ ప్ర‌శ్న వేసాడు. స‌ర్.. మీరు మా ప్ర‌భాస్‌తో ఎందుకు సినిమా తీయలేదు అని. ఈ ట్వీట్ చూసాక కృష్ణ‌వంశీ రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా న‌డుచుకుంటూ వెళ్లిపోవాల‌నుకున్నారు. కానీ తాను ప్ర‌భాస్‌తో ఆల్రెడీ సినిమా తీసాన‌న్న విష‌యం ఇప్పుడున్న ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి గుర్తుచేయాల‌నుకున్నారు. నేను ప్ర‌భాస్‌తో చక్రం తీసా. మీరు సినిమా చూడ‌లేద‌య్యా అంటూ స‌మాధానం ఇచ్చారు