Ram Charan క‌లెక్ష‌న్‌లో చీపెస్ట్ వాచ్ ఇదే..!

Hyderabad: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు (ram charan) వాచ్‌లంటే ఎంతో క్రేజ్. ల‌క్ష‌ల నుంచి కోట్లు విలువ చేసే ఎన్నో ర‌కాల క‌లెక్ష‌న్లు ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఆయ‌న బ‌య‌టికి వెళ్లినప్పుడ‌ల్లా చేతికి ఉండే వాచ్ (watch) ఎప్పుడూ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా ఉంటుంది. అయితే చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఉన్న వాచ్‌ల‌లో ఒక వాచ్ మాత్రం ఆయ‌న‌కు ఎంతో ప్ర‌త్యేకమ‌ట‌. అంతేకాదు.. ఆ ఒక్కటి ఆయ‌న కలెక్ష‌న్‌లో ఉన్న చీపెస్ట్ వాచ్‌ అని చెప్పాలి. (ram charan)

ఇంత‌కీ అది ఏం వాచ్ అంటే.. కాసియో డిజిటిల్ వాచ్. రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఉన్న కాసియో వాచ్ ధ‌ర రూ.5000 నుంచి రూ.10,000 మ‌ధ్య‌లో ఉంటుంద‌ట‌. కోవిడ్ స‌మ‌యంలో క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఆయ‌న ఆ వాచ్ కొనుగోలు చేసార‌ట‌. అందుకే త‌న ద‌గ్గ‌ర ఎన్ని ల‌క్ష‌లు, కోట్లు విలువ చేసే వాచెస్ ఉన్నా ఇది ఎంతో స్పెష‌ల్ అని చెప్తుంటారు చ‌ర‌ణ్‌. ఆయ‌నే కాదు.. ఇటీవ‌ల బేబీ (baby) స‌క్సెస్ మీట్‌కి వ‌చ్చిన‌ప్పుడు స్టైలిష్ స్టార్ బ‌న్నీ (allu arjun) కూడా కాసియో వాచ్ పెట్టుకునే వ‌చ్చారు.