Re Release: ఆన్ ది వే..!

Hyderabad: క‌న్నుల బాస‌లు తెలియ‌వులే.. క‌న్నెల మ‌న‌సులు ఎరుగ‌వులే.. ఎన్నిసార్లు విన్నా అదే ఫీల్. అదే వైబ్. ఫ్యాన్స్ కోరిక మేర‌కు 7/G బృందావ‌న్ కాల‌నీ (re release) సినిమా త్వ‌ర‌లో రీ రిలీజ్ అవ్వ‌బోతోంది. 4K వెర్ష‌న్‌ను రెడీ అవుతోంది. ర‌వి కృష్ణ‌ (ravi krishna), సోనియా అగ‌ర్వాల్ (sonia agarwal) న‌టించిన ఈ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు పెద్ద‌గా ఆడ‌లేదు కానీ ఇప్పుడు మీమ్స్‌లో ఈ సినిమాకు విప‌రీత‌మైన పాపులారిటీ వ‌చ్చేసింది. ఇందులో హీరో తండ్రి పాత్ర‌లో న‌టించిన చంద్ర‌మోహ‌న్.. ర‌వికృష్ణ‌ను కాలితో త‌న్నే టెంప్లేట్ ఏ రేంజ్‌లో ఫేమ‌స్ అయిందో ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే తెలిసిపోతుంది. త్వ‌ర‌లో రీ రిలీజ్ డేట్‌ను టీం అనౌన్స్ చేయ‌బోతోంది.