Pushpa 2: బన్నీ అందుకే చీరకట్టుకున్నాడా..?
Hyderabad: పుష్ప: ది రూల్ (pushpa: the rule)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun). దర్శకుడు సుకుమార్ (sukumar) ఈసారి టీజర్‌తోనే మరింత హైప్ పెంచేసారు. ఇటీవల పుష్పగాడి రూలు అంటూ రిలీజ్ అయిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌కు తెలుగులో కంటే నార్త్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. టీజర్ కంటే ఎక్కువ పుష్ప 2 (pushpa 2) పోస్టర్‌కు ఫ్యాన్స్ థ్రిల్ అయిపోతున్నారు. ఎందుకంటే పోస్టర్‌కు బన్నీ చీరకట్టు, నగలతో అమ్మోరుతల్లిగా కనిపిస్తున్నారు.
బన్నీ ఈ గెటప్ వేయడానికి వెనుక 3 కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ పుష్ప తిరుపతి (tirupati) పోలీస్ స్టేషన్ నుంచి శేషాచలం(seshachalam) అడవుల్లోకి పారిపోయినట్లు టీజర్‌లో చూపించారు. తిరుపతిలో గంగమ్మతల్లి జాతర అట్టహాసంగా జరుగుతుంది. ఈ జాతరలో మగవారు ఆడవారిగా తయారై పాల్గొంటారు. గంగమ్మతల్లి జాతర బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్(allu arjun) చీరకట్టులో అమ్మోరుతల్లిగా ఫైట్ చేస్తాడని టాక్. అందుకే ఆ చీర కట్టుకున్నాడని కొందరు అంటున్నారు.
పుష్ప(pushpa) పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కాబట్టి వారికి దొరక్కుండా ఉండేందుకు చీరకట్టుకుంటాడని మరికొందరు చెప్తున్నారు. సినిమాలో హీరోయిన్ అయిన రష్మిక మందనను(rashmika mandanna) చంపేస్తారని, ఆమె చావుకి రివేంజ్ తీర్చుకోవడం కోసం చీరకట్టుకుని విలన్లను పుష్ప నరుకుతాడని నెటిజన్లు హైప్ పెంచేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో ఇలాంటి లుక్‌లో దర్శనమిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పుష్ప-1(pushpa 1)తో పోలిస్తే పుష్ప-2(pushpa 2)కి బాక్సాఫీస్ బద్దలైపోద్దని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఫ్యాన్స్.