Indian Box Office గ‌ర్జ‌న‌..!

జులై ఆగ‌స్ట్ నెల‌ల్లో రిలీజ్ అయిన సినిమాలు కేవ‌లం స్వాతంత్ర్య దినోత్స‌వ వారంలో (indian box office) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కోట్ల‌లో క‌లెక్ష‌న్లు కుమ్మ‌రించాయి. కేవ‌లం ఇండిపెండెన్స్ వీక్‌లో ఇండియ‌న్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ 1229.93 కోట్లు. ఈ కలెక్షన్లు అన్నీ ఈ నాలుగు సినిమాలు తీసుకొచ్చిన‌వే.

జైల‌ర్ (jailer)

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ (nelson dilipkumar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.500 కోట్లు రాబ‌ట్టి టాప్ స్థానంలో ఉంది.

గ‌ద్ద‌ర్ 2 (gadar 2)

బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ (sunny deol) న‌టించిన గ‌ద్ద‌ర్ 2కి స్వాతంత్ర్య దినోత్స‌వం ముందు రోజు వ‌ర‌కు బాగానే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. కానీ కేవ‌లం ఇండిపెండెన్స్ డే రోజు మాత్రం రూ.50 కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. అలా ఇప్ప‌టివ‌ర‌కు గ‌ద్ద‌ర్ 2 రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరి రెండో స్థానం ద‌క్కించుకుంది. (indian box office)

OMG2

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ (akshay kumar) న‌టించిన ఈ సినిమాపై ట్రోల్స్ వ‌స్తాయేమో అని భ‌య‌ప‌డ్డారు కానీ సెన్సార్ బోర్డు పుణ్య‌మా అని ఆడియ‌న్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. రూ.100 కోట్లు రాబ‌ట్టిన ఈ సినిమా మూడో స్థానంలో ఉంది.

భోళా శంక‌ర్ (bhola shankar)

మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అది కేవ‌లం మెగాస్టార్ వ‌ల్లే సాధ్య‌మైంది కానీ సినిమాలో కంటెంట్ వ‌ల్ల కాదు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. (indian box office)