Tollywood Sequels: పార్ట్ 2 కోసం ప‌డిగాపులు..!

టాలీవుడ్‌లో సీక్వెల్స్ (tollywood sequels) సందడి మామూలుగా లేదు. ఒక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందంటే.. దానికి సీక్వెల్ తీసేయాల‌ని ద‌ర్శ‌కులు ఉవ్విళ్లూరుతుంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ నుంచి 10 బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు సీక్వెల్స్ రాబోతున్నాయ్. అవేంటో చూద్దాం.

దేవ‌ర‌ (devara)

కొరటాల శివ‌..(koratala siva) యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. సాధారణంగా ఎన్టీఆర్ నుంచి ఏడాదికి ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఆయ‌న రెండు భాగాలుగా రాబోతున్న సినిమాలో న‌టిస్తున్నారంటే దేవ‌ర‌పై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇటీవ‌ల దీనికి పార్ట్ 2 కూడా ఉండ‌బోతోందని కొర‌టాల ఎనౌన్స్ చేసారు. ఇప్ప‌టికైతే మొద‌టి పార్ట్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రిగిపోతోంది. 2024 స‌మ్మ‌ర్‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

స‌లార్ (salaar)

రెబెల్ స్టార్ ప్రభాస్..(prabhas)  డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ (prashant neel) కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా సలార్. ఇప్ప‌టికే ప‌లుసార్లు వాయిదాల‌కు గురై మొత్తానికి డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. KGFతోనే తానేంటో ప్రూవ్ చేసేసుకున్న ప్ర‌శాంత్ నీల్ ఆ త‌ర్వాత KGF2, ఇప్పుడు KGF3 కూడా తీయ‌బోతున్నారు. ఇప్పుడు స‌లార్ కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. స‌లార్‌కి పార్ట్ 2 కూడా ఉంద‌ని ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌టించారు. (tollywood sequels)

పుష్ప‌ (pushpa)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో (allu arjun) కాస్త కొత్త‌గా ఎక్స్‌ప‌రిమెంట్ చేసి పుష్ప‌ ఆయ‌న‌కు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టారు సుకుమార్ (sukumar). పుష్ప‌-1 తీస్తున్న స‌మ‌యంలోనే దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించేసారు. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ న‌టుడు చీర క‌ట్టుకుని నెయిల్ పాలిష్ పెట్టుకున్న లుక్‌లో క‌నిపించడం అంటే మామూలు విష‌య‌మా..! సుకుమార్‌ను నమ్మారు కాబ‌ట్టే బ‌న్నీ త‌న ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. ఈ సినిమాను 2024లో రిలీజ్ కానుంది.

గూఢ‌చారి (goodachari)

అంద‌రు హీరోల్లా కాకుండా ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌ని న‌మ్ముకున్నారు అడివి శేష్‌ (adivi sesh). ఆయ‌న‌కు స్పై బేస్డ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమ‌ట‌. అందుకే ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న యాక్ట్ చేసిన సినిమాలు స్పై, పోలీస్ క‌థ‌ల‌కు సంబంధించిన‌వే ఉంటాయి. అలా అనుకోకుండా సూప‌ర్ హిట్ అయిన సినిమానే గూఢ‌చారి. అందుకే ఇప్పుడు గూఢ‌చారి 2 తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. విన‌య్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

స్కంద‌ (skanda)

ల‌వ‌ర్ బాయ్‌లా క‌నిపించే రామ్‌లో (ram pothineni) ఇంత మాస్ హీరో ఉన్నాడా అనిపించేలా స్కంద సినిమాను రూపొందించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను (boyapati sreenu) . ఈ సినిమా ఇటీవ‌ల రిలీజై బాగానే ఆడుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా తీయ‌బోతున్నారు. చాలా మంది ఈ సినిమాకు సీక్వెల్ అవ‌స‌ర‌మా? అని అనుకుంటున్న‌ప్ప‌టికీ బోయపాటి శ్రీను త‌న ప్లాన్‌లో తానున్నారు. (tollywood sequels)

అఖండ‌ (akhanda)

నంద‌మూరి బాల‌కృష్ణ‌..(nandamuri balakrishna)  బోయ‌పాటి శ్రీనుకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన సినిమా అఖండ‌. అప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్స్ లేక అల్లాడుతున్న టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి అఖండ కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఇప్పుడు దీనికి కూడా సీక్వెల్ ప్లాన్ చేసే ప‌నిలో ఉన్నారు బోయ‌పాటి. ఇందులో యాక్ష‌న్ సీక్వెన్సెస్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండ‌బోతున్నాయ‌ని ఆల్రెడీ బోయ‌పాటి వెల్ల‌డించారు.

బింబిసార‌ (bimbisara)

స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న క‌ళ్యాణ్‌ రామ్‌కు (kalyan ram) బింబిసార మాంచి హిట్ ఇచ్చింది. విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్‌.. ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్‌2 తీసే ప‌నిలో ఉన్నారు. మ‌ల్లిడి వ‌శిష్ఠ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ (ismart shankar)

పూరీ జ‌గ‌న్నాథ్ (puri jagannath) మార్క్‌తో రామ్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ టైటిల్‌తో సీక్వెల్ తీసే ప‌నిలో ఉన్నారు పూరీ. ఆయ‌న తీసిన లైగ‌ర్ సినిమా డిజాస్ట‌ర్ అయిపోవ‌డంతో ఈసారి ఎలాగైనా డ‌బుల్ ఇస్మార్ట్‌తో మ‌ళ్లీ ట్రాక్ మీద‌కి రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

డీజే టిల్లు (dj tillu)

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (siddhu jonnalagadda) లాంటి పెద్ద‌గా స్టార్‌డం లేని హీరోతో ఏదో చిన్న సినిమాగా వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్ని సినిమా డీజే టిల్లు. ఎన్టీఆర్ లాంటి హీరో కూడా ఈ సినిమాలోని డైలాగ్స్ వాడుతూ పంచ్‌లు వేస్తున్నారంటే ఈ సినిమా ప్ర‌భావం జ‌నాల‌పై ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ సినిమాలోని చాలా సీన్ల‌తో కూడిన టెంప్లేట్స్‌తో మీమ్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ టైటిల్‌తో త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోంది. కాక‌పోతే ఇందులో అంద‌రి ఫేవ‌రేట్ నేహా శెట్టి (neha shetty) అలియాస్ రాధిక అక్క మాత్రం హీరోయిన్ కాదు. ఆమె స్థానంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ (anupama parameshwaran) న‌టించారు. ఇందులో నేహా కేమియో రోల్‌లో క‌నిపించ‌నున్నారు. (tollywood sequels)

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ (agent sai srinivasa athreya)

న‌వీన్ పోలిశెట్టికి (naveen polishetty) తొలి హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు ఉండ‌బోతున్నాయ‌ని ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ తెలిపారు.