భోజనం కుడి చేత్తోనే ఎందుకు తినాలి?
Spiritual: భోజనం కుడి చేత్తో చేయడం మనకు అలవాటు. చేత్తో అయినా స్పూన్‌తో అయినా కుడి చేత్తోనే తింటాం. ఎడమ చేత్తో తినడం తప్పు అని పెద్దలు చెప్తుంటారు. అసలు భోజనం కుడి చేత్తో తినడం వల్ల లాభాలేంటో తెలుసా?
కుడి చేత్తో భోజనం చేస్తున్నప్పుడు.. అన్నం ముద్ద చేతి వేళ్ల నుంచి నోటికి తగిలినప్పుడు మన ఒంట్లోని చక్రాలు ఉత్తేజితం అవుతాయి. దాని వల్ల నోటిలో లాలాజలం ఊరుతుంది. దీని వల్ల జీర్ణ ప్రక్రియ బాగుంటుంది.
కుడి చేతిని సూర్య నాడితో ఎడమ చేతిని చంద్ర నాడితో సమానంగా భావిస్తారు. కుడి చేత్తో చేసే పనులకు ఎక్కువ శక్తి కావాలి.
మంచి పనులన్నీ కూడా కుడి చేత్తోనే చేస్తాం. ఉదాహరణకు.. తీర్థం తీసుకోవడం.. దీపం వెలిగించడం.. ఇవన్నీ కూడా కుడి చేత్తో చేసే పనులు.
ఎడమ చేతిని శుభ్రం చేసుకునేందుకు వాడతాం కాబట్టి ఆ చేత్తో తినడం వంటివి చేయకూడదు.