ఆదివారం హెయిర్ క‌ట్ చేసుకుంటే ఆయుక్షీణమా?

when to have hair cut and when not to have

Spiritual: ఏద‌న్నా ప‌ని చేసే ముందు తిథి, వారాలు, న‌క్ష‌త్రాలు చూసుకుంటూ ఉంటాం. అదే విధంగా జుట్టు క‌త్తిరించుకునే విష‌యంలోనూ మ‌న శాస్త్రంలో కొన్ని రోజుల్లో మాత్ర‌మే చేసుకోవాల‌ని చెప్పార‌ని అంటున్నారు ప్ర‌ముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ల‌లితా ఉపాస‌కులు నానాజీ ప‌ట్నాయక్.

సాధార‌ణంగా ఆదివారం అంద‌రికీ సెల‌వు కాబ‌ట్టి అదే రోజున జుట్టు క‌త్తిరించుకోవ‌డం, గెడ్డం గీయించుకోవ‌డం వంటివి చేస్తుంటారు. నిజానికి ఆదివారం రోజున జుట్టు క‌త్తిరించుకుంటే ఆయుక్షీణం అని శాస్త్రంలో రాసుంద‌ట‌. మ‌రి ఎప్పుడు క‌త్తిరించుకోవాలి? శ‌నివారం, ఆదివారం, మంగ‌ళ‌వారాల్లో జుట్టు క‌త్తిరించుకోకూడదు. సోమ‌వారం, బుధ‌వారం రోజున క‌త్తిరించుకుంటే మంచిది. గురువారం,శుక్ర‌వారాల్లో జుట్టు క‌త్తిరించుకునే ఆర్థిక న‌ష్టం వాటిల్లుతుంద‌ట‌. అంటే.. మీకు ఈ వారంలో డ‌బ్బులు రావాల్సి ఉన్నాయ‌నుకోండి.. ఈ వారంలోని గురు, శుక్ర‌వారాల్లో మీరు జుట్టు క‌త్తిరించుకుంటే ఆ డ‌బ్బులు రాకుండా ఆగిపోతాయ‌ని నానాజీ అంటున్నారు.

ఆదివారం జుట్టు కత్తిరించుకుంటే ఒక నెల ఆయుష్షు త‌గ్గిపోతుంద‌ట

మంగ‌ళ‌వారం జుట్టు క‌త్తిరించుకుంటే 7 వారాల ఆయుష్షు త‌గ్గిపోతుంది

శ‌నివారం చేయించుకుంటే 8 వారాల ఆయుష్షు త‌గ్గిపోతుంది

బుధ‌వారం జుట్టు క‌త్తిరించుకుంటే 5 నెల‌ల ఆయుష్షు పెరుగుతుంద‌ట‌

సోమ‌వారం చేయించుకుంటే 7 నెల‌ల ఆయుష్షు పెరుగుతుంది

గురు, శుక్ర‌వారాల్లో చేయించుకుంటే రావాల్సిన డ‌బ్బులు ఆగిపోతాయి కానీ 10, 11 నెలల ఆయుష్షు పెరుగుతుంది.

ఇక్కడ మ‌రో విష‌యం ఏంటంటే.. ఏక సంతానం ఉన్న‌వారు సోమ‌వారం రోజున జుట్టు క‌త్తిరించుకోకూడ‌ద‌ని శాస్త్రంలో ఉంద‌ని నానాజీ వెల్ల‌డించారు. అంతేకాదు.. మీ జ‌న్మ న‌క్ష‌త్రం రోజున కూడా చేయించుకోవ‌డం మంచిది కాద‌ట‌.