నేడే శని త్రయోదశి.. ఇలా చేసారంటే జీవితం నాశనమే
Shani Trayodashi: నేడే శని త్రయోదశి. శ్రావణ మాసంలో వచ్చిన ఈ శని త్రయోదశి ఎంతో శక్తిమంతమైనది. అయితే.. ఈ శని త్రయోదశి రోజు ఏం చేస్తే మంచిది? ఏం చేయకపోతే మంచిది? అనే విషయాలను తెలుసుకుందాం.
ఏలినాటి శని, అర్థాష్టమ శని, శని మహర్దశ ఉన్నవారు ఈ శని త్రయోదశి రోజులు ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. అలాగని అందరికీ ఈ శని త్రయోదశి రోజులు పూజలు చేయించుకోవడం అనేది మంచిది కాదట. ఎందుకంటే… శని భగవానుడు కర్మ కారకుడు, వృత్తి కారకుడు, వ్యాపార కారకుడు. ఈ శని త్రయోదశి నాడు తప్పక పాటించాల్సిన నియమం ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ శని త్రయోదశి రోజైనా నాకు పట్టిన శని వదిలిపోవాలి స్వామీ అని మాత్రం పొరపాటున కూడా మనసులో కానీ వాక్కుతో కానీ అనకండి.
ఎందుకంటే శని అనుగ్రహమే లేదంటే మనిషికి కాళ్లే ఉండవు. మనం కాళ్లతో నడవడానికి కారకుడు శని. ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, మనలోని నాడీ వ్యవస్థ పనితీరుకు కారకుడు శని. మన శ్రమకు కారకుడు శని. మనం శ్రమిస్తే మనకు లాభాన్నిచ్చేవాడు శని దేవుడు. శని అనుగ్రహానికి కోట్లు సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు. కానీ శని గ్రహం బాగా లేని వారు శనివారం నల్ల దుస్తులు దానం ఇవ్వడం.. నూనె దానం చేయడం వంటివి చేయాలి. అప్పుడు శని గ్రహం మంచి వైపు నడిపించే అవకాశం ఉంటుంది.