Surya Grahanam: మహాభారతం ముందు ఏర్పడిన గ్రహణం మళ్లీ రాబోతోంది
Surya Grahanam: అక్టోబర్ 2న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. ఆ రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 5000 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. దీనినే ఆంగ్లంలో రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఇలాంటి సూర్యగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయంటే.. ఎప్పుడైతే భగవంతుడు, లోక కంఠకుడు మళ్లీ పుట్టబోతున్నాడో అప్పుడు ఇలాంటి గ్రహణం ఏర్పడే అవకాశం ఉంటుందట. అక్టోబర్ 2 తర్వాత ఇలాంటి గ్రహణం మళ్లీ 2040లో వచ్చే అవకాశం ఉందట.
ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధం ఏర్పడటానికి కంటే ముందు ఒకసారి వచ్చింది. అంటే మహాభారతంలో యుద్ధం జరగబోతోంది అని చెప్పడానికి ఆ సమయంలో ఖగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడింది. ఈసారి సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజు రాబోతోంది. మరి ఇప్పుడు ఏర్పడబోయే గ్రహణం కూడా యుద్ధం ముందు వస్తున్నట్లే అనుకోవాలా అవును. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. త్వరలో ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రష్యా.. రష్యాకు అనుకూలంగా ఉన్న దేశాలన్నీ కలిసి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందట.
అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరంలేదు. కాకపోతే గర్భిణులు మాత్రం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. ఈ గ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9:13 గంటల సమయంలో ఏర్పడి అక్టోబర్ 3న తెల్లవారుజామున 3:17 నిమిషాల వరకు ఉంటుంది.
ఈ గ్రహణం ఏ రాశులకు మంచిది కాదు?
Surya Grahanam: ఈ గ్రహణం హస్తా నక్షత్రం ఒకటి రెండో పాదంలో జరగబోతోంది. కాబట్టి హస్తా నక్షత్రం వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఇలా అక్టోబర్ 18 వరకు ఏదీ కలిసి రాదు. ఇది కన్యా, మీన, సింహ, మేష రాశులకు వర్తిస్తుంది. సూర్యగ్రహణం కనిపించేవారికి 100% కీడు జరుగుతుంది. కనిపించని వారికి 50% జరుగుతుంది.
ఎవరికి మేలు జరుగుతుంది?
కర్కాటక, మిథున, వృశ్చిక, కుంభ రాశులకు ఈ గ్రహణం వల్ల మంచి జరుగుతుంది. ఇది కూడా సూర్యగ్రహణం కనిపించేవారికి 100% కీడు జరుగుతుంది. కనిపించని వారికి 50% జరుగుతుంది. మకర, ధనుస్సు, వృషభ, తులా రాశులకు నార్మల్గానే ఉంటుంది.
పరిహారాలు ఏంటి?
Surya Grahanam: ఎవరి జాతకంలో అయితే సూర్యుడు, రాహువు లేకపోతే సూర్యుడు, కేతువు కలిసి ఉంటారో వారు అరిష్ట నివారణ యాగం చేయించుకుంటే అంతా మంచే జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే… ఎవరైతే సూర్య గ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యలో పుట్టారో లేదా.. చంద్రగ్రహణం, సూర్య గ్రహణం అయిన 15 రోజులకు పుట్టారో వారు గ్రహణ వేదతో పుట్టినట్లు లెక్క.
ఇదెలా తెలుసుకోవాలంటే.. మీరు పుట్టిన సంవత్సరంలోని తేదీని బట్టి మీరు పుట్టిన 30 రోజుల ముందు కానీ తర్వాత కానీ గ్రహణాలు ఏర్పడ్డాయేమో చూసుకుంటే తెలుస్తుంది. ఇది గూగుల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ గ్రహణ వేదతో పుట్టినవారికి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండదు. ఏ పని చేసినా కలిసిరాదు. జీవితాంతం రుణగ్రస్తులు అయ్యుంటారు. ఎప్పటికప్పుడు శత్రుబాధ కలుగుతూనే ఉంటుంది. సుఖసంతోషాలు ఉండవు. ఎంత సంపాదించినా ఆ సంపాదన మిగలవు. ఇవన్నీ లక్షణాలు ఉంటే గ్రహణ వేదతో బాధపడుతున్నట్లే.
ఒకవేళ పూజలు చేయించుకునే స్తోమత లేని వారు.. గ్రహణం రోజున తూర్పుకు అభిముఖంగా ఇంట్లో కూర్చుని శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, లలితా సహస్ర నామాలు, విష్ణు సహస్ర నామం చదువుకుంటే మంచిది. గర్భిణులు మాత్రం ఓంకారంతో కూడుకున్న మంత్రాలను గ్రహణ సమయంలో చదవకూడదు.
DISCLAIMER: పైన చెప్పిన విషయాలన్నీ సొంతంగా చెప్పినవికావు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ప్రదీప్ జోషి వెల్లడించినవి