రాహు కాల దీపం ఇలా పెడితే.. కోట్ల అప్పున్నా తీరిపోతుందట
Spiritual Remedies: చాలా మంది అప్పులతో సతమతం అవుతుంటారు. అప్పులు తీర్చే మార్గం దొరక్క డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. దీని వల్ల ఇంట్లో మనశాంతి కూడా ఉండదు. అలాంటి వారు రాహుకాల దీపం పెడితే ఎన్ని కోట్ల అప్పున్నా తీర్చే మార్గం తప్పకుండా దొరుకుతుందట. రాహుకాల దీపం అనేది పిండేసిన నిమ్మకాయలో నెయ్యి పోసి పెడతారు. ఇంతకీ రాహు కాల దీపం ఎలా పెట్టాలి? ఏ రోజు పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
ఆదివారం నాడు పెడితే – పితృదోషాలు పోతాయి
సోమవారం – ఇతరుల వల్ల మోసపోవడం వంటివి జరగకుండా ఉంటాయి. రెండు లేదా నాలుగు దీపాలు పెట్టచ్చు.
మంగళవారం – తరచూ ప్రమాదాల బారిన పడేవారు, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉండేవారు పెట్టచ్చు. కుజ దోషం ఉన్నవారికి కూడా మంగళవారం రాహు కాల దీపం బాగా పనిచేస్తుంది. దీనికి మూడు దీపాలు పెట్టాల్సి ఉంటుంది.
బుధవారం – మూడు, ఐదు, దీపాలు వెలిగించగలితే ఎంతటి అప్పులున్నా తీరిపోతాయి. మంచి సంపదలు పెరుగుతాయి. పాడైన సంబంధాలు కలుస్తాయి.
గురువారం- గురు బలం తక్కువగా ఉన్నవారు గురువారం నాడు రాహుకాల దీపం వెలిగించుకోవచ్చు.
శుక్రవారం – స్త్రీ శాపం ఉన్నవారు, శుక్ర రాశులు పాడైనవారు శుక్రవారం నాడు రాహుకాల దీపం పెట్టుకోవచ్చు. దీపం పెట్టే సమయంలో శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ పెడితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. 3, 5, 6 దీపాలు వెలిగిస్తే మంచిది.
శనివారం – రోగాలతో బాధపడేవారికి శనివారం రాహుకాల దీపం పెట్టుకుంటే మంచిది.
విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నవారు, ప్రమోషన్స్ కావాలనుకున్నవారు కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు. దీపం పెడుతున్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.