ఉద్యోగం త్వ‌రగా రావాలంటే ఈ స్తోత్రం ప‌ఠిస్తే చాల‌ట‌!

Spiritual: ఉద్యోగం త్వ‌ర‌గా రావాల‌న్నా.. లేదా చేస్తున్న ఉద్యోగం స్థిరంగా ఉండాలన్నా ఈ ఒక్క స్తోత్రం రోజూ ప‌ఠిస్తే చాల‌ని చెప్తున్నారు ప్ర‌ముఖ ల‌లితాదేవి ఉపాస‌కురాలు నిట్ట‌ల కిర‌ణ్మయి. ఇంత‌కీ ఆ స్తోత్రం విశేషాలేంటో తెలుసుకుందాం.

ల‌లితా స‌హ‌స్రనామంలోని

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ !
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలాయే నమోనమః !!

ఈ నామాన్ని నిత్యం చ‌దువుకుంటూ..

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం !!
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం !!

ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా లేదా ప్ర‌మోష‌న్ కోసం ఈ మంత్రాన్ని చ‌దువుకోండి

శ్రీ రాజమాతంగ్యై నమః

పై మంత్రాన్ని చ‌దువుతూ ఈ కింది మంత్రాన్ని కూడా చదువుకోండి

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ !
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలాయే నమోనమః !!

ఈ పైన చెప్పిన శ్లోకాల‌ను క‌లిపి రోజుకు 108 సార్లు పారాయణం చేసుకుంటే ఉద్యోగం త్వ‌ర‌గా వ‌స్తుంద‌ట‌. ఈ మంత్రం జ‌పిస్తున్న‌ప్పుడు చేతిలో ప‌సుపు పెట్టుకోవ‌డం తప్ప‌నిస‌రి. శ్లోకం అంతా చ‌దివేసాక మీ చేతిలో ఉన్న పసుపును త‌ల మ‌ధ్య‌లో ఉండే బ్ర‌హ్మ రంధ్రంలో పెట్టుకుంటే మంచిది. ఇలా ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు చేసినా ఫర్వాలేదు.. రోజూ చేసినా కూడా ఎన్నో మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.