Crow: కాకి శకునాలు.. తెలీక విసుక్కుంటున్నాం
Crow: ఇంటి ముందు కాకి వాలితేనో అరిస్తేనో తరిమేయడం.. విసుక్కోవడం వంటివి చేస్తుంటాం. శినిదేవుని వాహనమైన కాకి శకునాలు తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు.
మీరు ఏ పనికైనా బయటికి వెళ్తుంటే మూడు కాకులు ఒకే చోట కనిపిస్తే ఆ పని సఫలీకృతం అవుతుందట
పని మీద బయటికి వెళ్తున్నప్పుడు వెనక నుంచి కాకి అరుపు వినిపిస్తే అది శుభ సూచకం
ఉదయం లేవగానే మన ఇంటి ముందు నాలుగు కాకులు వాలినట్లుగా కనిపిస్తే మంచి పరిణామం
భోజనం చేస్తున్నప్పుడు ముద్ద చేతి నుంచి జారి అది కాకికి దక్కితే కోరికలు తీరుతాయని అంటారు
అప్పు వసూలు చేయడానికి వెళ్తున్నప్పుడు కాకి మీ తలపై నుంచి వెళితే ఆ అప్పు వసూలు అవుతుందట
కాకి ముక్కుతో ఏదన్నా ఆహారం పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తే మన పని సఫలం అవుతుందట.