దీక్ష చేస్తున్న‌ప్పుడు ర‌జ‌స్వ‌ల వ‌స్తే ఏం చేయాలి?

should a woman continue deeksha during her periods

Spiritual: దీక్ష చేసేట‌ప్పుడు 40 రోజుల పాటు నియ‌మం పెట్టుకుంటూ ఉంటారు. దీనిని మండ‌ల అంటారు. అయితే మ‌గ‌వారికి నిర్విరామంగా 40 రోజుల పాటు దీక్ష చేసే అవ‌కాశం ఉంటుంది కానీ ఆడ‌వారికి ర‌జ‌స్వ‌ల కార‌ణంగా అలా చేయ‌డానికి ఉండ‌దు. కొంద‌రైతే దీక్ష కోస‌మ‌ని ర‌జ‌స్వ‌ల రాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హానిక‌రం. ఏదో ఒక‌రోజు పాటు ర‌జ‌స్వ‌ల రాకుండా ట్యాబ్లెట్‌తో ఆపితే ఫ‌ర్వాలేదు కానీ మాటిమాటికీ వేసుకుంటే గ‌ర్భ‌సంచిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.

అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే.. దీక్ష మ‌ధ్య‌లో ర‌జ‌స్వ‌ల అయితే.. ఆ దీక్ష‌ను ఆపేసి ఐదు రోజుల త‌ర్వాత కొనసాగించ‌వ‌చ్చు. అయితే మ‌ళ్లీ మొద‌టి రోజు నుంచి మొద‌లుపెట్టాల్సిన అవ‌స‌రం లేదు. అలా ర‌జస్వ‌ల వ‌చ్చిన ప్ర‌తీసారి మొద‌టి నుంచి చేసుకుంటూ వెళ్తే ఆ దీక్ష పూర్త‌వ్వ‌దు. కాబ‌ట్టి ర‌జ‌స్వ‌ల అయిపోయాక కొన‌సాగిస్తే స‌రిపోతుంది.