Spiritual: ఇంటి కుల‌దైవం ఎవ‌రో తెలుసుకోవ‌డం ఎలా?

How can we determine who is the Kuldevatha of our household?

Spiritual: చాలా మందికి త‌మ ఇంటి కుల‌దైవం, ఇల‌వేల్పు ఎవ‌రో తెలీదు. కుల‌దేవ‌త‌ను పూజించ‌కుండా.. ఇష్ట దేవ‌త‌ను ఎంత పూజించినా ఫ‌లితం ఉండ‌ద‌ని శాస్త్రాల్లో చెప్తుంటారు. అలాంట‌ప్పుడు ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి?

ఒక‌వేళ మీకు మీ కుల‌దేవ‌త ఎవ‌రో తెలీకపోతే ఇష్ట‌దైవ ఉపాస‌న రోజూ చేస్తుండండి. ఆ ఇష్ట దైవ‌మే మీ కుల‌దేవ‌త ఎవ‌రో తెలిసేలా చేస్తుంద‌ట‌. ఒక‌వేళ తెలీక‌పోయినా ఫ‌ర్వాలేదు. మీకు ఇష్ట‌దైవం ఒక‌రు ఉన్నారంటే.. అది క‌చ్చితంగా పూర్వజ‌న్మ వాస‌న‌ల వ‌ల్ల ఏర్ప‌డిన అల‌వాటు అవుతుంది. అలా మీ ఇష్టదైవాన్ని జీవితాంతం ఉపాసించుకున్నా ఫ‌లితం ఉంటుంది.