Janmashtami: కన్నయ్య దగ్గర ఈ వస్తువులు పెడితే అరిష్టం
Janmashtami: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. సాధారణంగా మన దక్షిణాది ప్రాంతాల కంటే ఉత్తరాదిన ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఒకవేళ మీరు కూడా కన్నయ్యను ఇంటికి తెచ్చుకుని పూజించుకోనున్నట్లైతే ఈ విషయాలు మీకోసమే. కృష్ణుడి వద్ద ఈ వస్తువులను పెట్టకూడదట. అలా అయితే అరిష్టం అని పెద్దలు అంటున్నారు.
కన్నయ్య విగ్రహం పక్కన పాత వస్తువులు, చిరిగిపోయిన పాడైపోయినవి ఏవీ ఉంచకండి. ఆయన ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉండాలి.
మీరు నైవేధ్యం పెడుతున్న పళ్లెం మరింత శుభ్రంగా ఉండాలి. వాడేసినది ఉండకూడదు.
నైవేధ్యాలు కూడా అప్పటికప్పుడు తయారు చేసినవి పెడితే మంచిది. అందులో సాత్వికమైన పదార్థాలు మాత్రమే వాడాలి.