ముగ్గు పెట్టేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి
Spiritual: సాధారణంగా ముగ్గుని ముగ్గు పిండితో కానీ చాక్‌పీసులతో కానీ వేస్తుంటారు. ఇల్లంతా ముగ్గుపిండితో, సుద్ద ముక్కలతో వేసినా ఫర్వాలేదు కానీ దేవుడి గదిలో మాత్రం కచ్చితంగా ముగ్గును బియ్యం పిండితోనే వేయాలి. ఇలా వేస్తే ఎంతో శుభప్రదం అని శాస్త్రంలో ఉంది. మీరు పూజా గదిని కడుక్కున్న ప్రతీసారి బియ్యం పిండితో ముగ్గు వేస్తూ ఉండండి. పొరపాటున కూడా పూజా గదిలి అలికేసి ఎలాంటి ముగ్గు లేకుండా వదిలేయకండి. అది అశుభం.