Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలో తప్పులా?
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా అందరూ ఇష్టంగా చదివేదే. ముఖ్యంగా మంగళవారాల్లో ఈ హనుమాన్ చాలీసా చదువుకుంటే ఎంతో మంచిదని చెప్తుంటారు. అయితే హనుమాన్ చాలీసాలో నాలుగు తప్పులు ఉన్నాయట. అంటే హనుమాన్ చాలీసాలోని చౌపాయిల్లో (శ్లోకాలు) నాలుగు తప్పులు ఉన్నాయి. ఇది చాలా మందికి తెలీక అలాగే చదివేస్తుంటారు.
సంకర సువన కేసరీ నందన (ఆరవ చౌపాయిలో ఉంటుంది)
ఈ పై శ్లోకంలో ఉన్న తప్పు సువన. సువన అని చదవకూడదు. సంకర స్వయం కేసరీ నందన అని చదవాలి.
అర్థం: సువన్ అంటే కుమారుడు అని అర్థం. ఆంజనేయస్వామి శంకరుడి కుమారుడు కాదు ఆయనే శంకరుడు. అందుకే అలా అనకూడదు అంటారు.
సబ పర రామ తపస్వి రాజా (27వ చౌపాయిలో ఉంటుంది)
పై చౌపాయిలో ఉన్న తప్పు తపస్వీ. సబ పర రామ తపస్వి రాజా అని చదవకూడదు. సబ పర రామ రాయసిర రాజా అని చదవాలి.
అర్థం: రాముడు రాజే తప్ప తపస్వి కాదు అందుకే అలా అనకూడదు అని చెప్తుంటారు.
సదా రహో రఘుపతికే దాసా (32వ చౌపాయిలో ఉంటుంది)
సదా రహో రఘుపతికే దాసా అని చదవకూడదు. సాదరహో రఘుపతికే దాసా అని చదవాలి
అర్థం: ఇక్కడ సాదరహో అని ఎందుకు అనాలంటే రాముడి రసాయనం నీ దగ్గరుంది. నువ్వు ఎల్లప్పుడూ రఘుపతికి దాసుడివి అని అర్థం. నువ్వు రఘుపతికి దాసుడివే అని హనుమంతుడిని అన్నామంటే ఆయన ఓ రేంజ్లో పులకించిపోతాడు తెలుసా..!
జో సత బార పాఠ కర కోయీ (38వ చౌపాయి)
జో సత అని చదకూడదు. యహ సత అని చదవాలి
అర్థం: ఇక్కడ యహ సత వార అని ఎందుకు అనాలంటే.. బంధనాలు తొలగి మహా సుఖాలు పొందుతారని అర్థం.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. పైన చెప్పినవి తప్పు. అలా చదివితే మహా పాపం అని ఎవరైనా చెప్తే పట్టించుకోకండి. వీటిని పాఠాంతరాలు అంటారు. అంటే రెండు విధాలుగా చదివినా అందులో ఎలాంటి తప్పు లేదు.