నాగ దోషాన్ని పోగొట్టే అద్భుతమైన మంత్రం
Naga Dosham: నాగ దోషం లేదా సర్ప దోషం ఉందని తెలిస్తే వెంటనే జ్యోతిష్యుల వద్దకు వెళ్తుంటారు. కొందరు ఇలాంటివి బాగా నమ్ముతారు. మరికొందరు ఏది జరిగితే అది జరిగిందని వదిలేస్తుంటారు. అయితే.. పాపం కొందరు దోషం కారణంగా అనారోగ్య సమస్యలు.. పెళ్లిళ్లు కావేమోనన్న భయంతో వేల వేలు డబ్బులు వృథా చేసుకుంటూ ఉంటారు. నిజానికి అవేమీ అవసరం లేదు. ఈ శక్తిమంత్రమైన శ్లోకాలు చదువుకుంటే చాలు.. నాగ దోషం తొలగిపోతుంది. ఇంతకీ ఏంటా శ్లోకం అంటే.. నాగ కవచం.
మంత్రం
నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామదం
రుషి రస్య మహాదేవో గాయత్రీ చంద్ర ఈరితః
తారా బీజం శివాశక్తిః క్రోధబీజస్తు కీలకః
సర్వకామార్థ సిద్ధర్థ్యే వినియోగః ప్రకీర్తితః
శ్లోకం
అనంతోమే శరః పాతు కంఠం సంకర్షణస్తథా
కర్కోటకో నేత్ర యుగ్మం కపిలః కర్ణయుగ్మకం
వక్షస్థలం నాగయక్షః బహూకాల భుజంగమః
ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్టకం
మర్మాంగం అశ్వసేనస్తు పాదావశ్వతరోవతు
వాసుకిః పాతుమాం ప్రాచ్యే ఆగ్నేయాంతు ధనంజయః
మహాపద్మః ప్రతీచ్యాంతు వాయవ్యాం శంఖనీలకః
ఉత్తరే కంబలః పాతు ఈశాన్యాం నాగభైరవః
ఉత్థ్వంచ ఐరావతో ధస్తాత్ నాగబేతాళ నాయకః
సదాసర్వత్రమాం పాతుం నాగలోకాధినాయకాః
ఇలా మంత్రాన్ని, శ్లోకాన్ని రోజూ చదువుకుంటూ ఉంటే దోష సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ మంత్రం, శ్లోకం చదువుతున్నప్పుడు నాగదేవతకు పచ్చి పాలు నైవేధ్యంగా పెట్టాలి. ఇంట్లో మైల ఉన్నా.. రజస్వల అవుతున్నా కూడా ఈ మంత్రాన్ని జపించకూడదు. దీనిని అందరూ చదువుకోవచ్చు.