Spiritual: పుట్టిన‌రోజులు తేదీల ప్ర‌కారం చేసుకుంటున్నారా?

are you celebrating birthdays on born dates

Spiritual: చాలా మంది పుట్టిన తేదీల‌ను బ‌ట్టి జ‌న్మదిన వేడుక‌ల‌ను చేసుకుంటూ ఉంటారు. 99 శాతం మంది ఇలాగే త‌మ పుట్టిన‌రోజులు జ‌రుపుకుంటూ ఉంటారు. నిజానికి పుట్టిన తేదీ కంటే మన శాస్త్రం ప్ర‌కారం పుట్టిన తిథి ముఖ్యం. అందుకే మ‌నం రామ న‌వ‌మి, శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి, దుర్గాష్ట‌మి, వినాయ‌క చ‌వితి అని తిథుల ప్ర‌కారం పండుగ‌లు జ‌రుపుకుంటూ ఉంటాం. అందుకే మ‌నం కూడా మ‌నం ఏ తిథుల్లో జన్మించామో తెలుసుకుని దానిని బ‌ట్టి పుట్టిన‌రోజులు జ‌రుపుకుంటే మంచిది. ఎందుకంటే ప్ర‌తి తిథికి ఒక్కో అధిష్టాన దేవ‌త‌లు ఉంటారు. కాబ‌ట్టి పుట్టిన తిథి ప్ర‌కారం ఆ తిథి యొక్క అధిష్టాన దైవాన్ని స‌క్ర‌మంగా ఆరాధిస్తే ఎంతో మంచి ఫ‌లితం వ‌స్తుంది. ఒక‌వేళ తిథి తెలీని వారు పుట్టిన తేదీ తెలిస్తే అదే రోజున చేసుకున్నా స‌రిపోతుంది.