ఈ నెలలో శ్రీవారి ఉత్సవాల తేదీలు ప్రకటించిన TTD

ఏటా మార్చి నెలలో తిరుమలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఆలయంలో ఎలాంటి ఆర్జిన సేవలు ఉండవని… వాటిని రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఇదే సమయంలో శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ కోటా పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఉత్సవ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేసింది.

ఉత్సవ కార్యక్రమాలు ఇలా..
తెప్పోత్సవాల్లో భాగంగా.. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవార్లు తెప్పలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాల కారణంగా పలు సేవలను రద్దు చేశారు.. మార్చి3, 4 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, 5, 6 తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7న ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మార్చి 3న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజు శ్రీ కృష్ణ స్వామి అవతారంలో మూడు సార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మార్చి నెలలోనే తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్థంతి. మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు జరుగునున్నాయి. ఇక తిరుమలో తీసుకొచ్చిన ఫేస్‌ రికగ్నేషన్‌ విధానంతో భక్తులు నెలలో ఒకసారి మాత్రమే గదలు బుక్‌ చేసుకోవడంతోపాటు.. స్వామిని దర్శించుకుని, లడ్డూ ప్రసాదాలు తీసుకునే అవకాశం ఉంది.