IPL 2023 నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి త్వరలో మొదలుకాబోతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సన్ రైజర్స్ యాజమాన్యంతో రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నెరెడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీ లో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు.కాగా మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్… గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్‌రైజన్స్ హైదరాబాద్ పగ్గాలను మరోసారి విదేశీ ఆటగాడికే అప్పగించారు. ఈ సీజన్‌కు ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ను ప్రకటించారు.
సన్‌రైజర్స్ జట్టుకు ఇప్పటికే ఎందరో విదేశీ ఆటగాళ్లు కెప్టెన్‌గా వ్యవహరించారు. గతంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించినా టెంపరరీ కెప్టెన్‌గానే నియమించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డేవిడ్, విలియంసన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎవర్ని నియమిస్తారా అన్న మ్యాటర్ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ మయంక్ అగర్వాల్ లేదా మార్‌క్రమ్ పేర్లు వినిపించాయి. చివరకు సన్‌రైజర్స్ యాజమాన్యం మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించింది.