Mosagallaku Mosagadu: రీరిలీజ్​ ట్రైలర్​ రిలీజ్ చేసిన మహేష్!

Hyderabad: దివంగత నటుడు, నటశేఖర కృష్ణ(Krishna) నటించిన కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు(Mosagallaku Mosagadu). 1971లో వచ్చిన ఈ సినిమాలో విజయనిర్మల(Vijaya Nirmala) హీరోయిన్ గా నటించారు. కృష్ణను ప్రయోగాలకు కేరాఫ్​ అడ్రస్​గా మరోసారి నిరూపించిన సినిమా ఇది. అప్పట్లో భారీ విజయం అందుకున్న ఈ మూవీ, ఆపై హాలీవుడ్ సహా అనేక భాషల్లో విడుదలై అన్నింటా సూపర్ హిట్ అందుకుంది. కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, నాగభూషణం, జ్యోతిలక్ష్మి మొదలైనవాళ్లు కీలక పాత్రల్లో నటించారు.

కాగా, మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ  సినిమా 4K వెర్షన్ ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఈ మూవీ యొక్క 4K ట్రైలర్ ని రిలీజ్​ చేశారు. ‘నాకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి. మోసగాళ్లకు మోసగాడు తప్పకుండా  సినీ ప్రేక్షకులను మరొకసారి అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్​ చేశారు మహేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోసగాళ్లకు మోసగాడు  ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాని పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కేఎస్ ఆర్ దాస్ తెరకెక్కించారు.