AR Rahman: ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను!
Hyderabad: రాజ్-కోటి(Raj-Koti)) ద్వయంలో ఒకరైన రాజ్(Raj) మే 21న మరణించిన విషయం తెలిసిందే. 80ల్లో రాజ్, కోటితో కలిసి దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కాగా, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. రాజ్ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్(AR Rahman) సోషల్ మీడియా వేదికగా రాజ్‌కి నివాళి అర్పించి తాను రాజ్‌తో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
‘రెస్ట్ ఇన్ పీస్ సోమరాజు గారూ, 80లలో రాజ్ – కోటితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ట్వీట్ చేశారు రెహమాన్. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు రెహమాన్ రాజ్ – కోటి ద్వయంతో 8 సంవత్సరాలు కీబోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామర్‌గా పనిచేశారు. రాజ్ – కోటితో తన అనుబంధాన్ని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం రెహమాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు కూడా రాజ్, కోటి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Rest in peace Somaraju Garu …I can never forget the pleasant memories working with Raj-koti in the 80s ❤️🩹🤲🏼🙏🥀🌹💐 pic.twitter.com/xQdwYMyWs1
— A.R.Rahman (@arrahman) May 22, 2023