OTT War:​ ఒకేసారి 111 షోలు ప్రకటించిన జీ5!

Hyderabad: ప్రస్తుతం ఓటీటీ(OTT) ట్రెండ్ నడుస్తోంది. థియేటర్(Theater) లో సినిమాలు చూడడానికంటే ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాపులర్​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​ అయిన నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్(Amazon Prime), హాట్ స్టార్, జీ5 ప్రేక్షకులను మెప్పించేలా పలు సినిమాలను థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీలో అందిస్తున్నాయి. కేవలం సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్(Web Series), టాక్ షోస్, సింగింగ్ అండ్ రియాలిటీ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఓటీటీలోనూ పోటీ పెరిగిపోతోంది. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కంటెంట్​ను అందించేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇటీవల నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్ కూడా సౌత్ భాషల్లో కొత్త సినిమాలు, సిరీస్​లను అందుబాటులోకి తెచ్చాయి. తెలుగు ఓటీటీలు కూడా వీలైనంత కంటెంట్​ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక, ఇటీవలే జియో మూవీస్ కూడా పూర్తి స్థాయి ఓటీటీగా మారి ఏకంగా 100 సినిమాలు, సిరీస్ లు రాబోతున్నట్టు ప్రకటించి ఒకేసారి ఇండియన్ ఓటీటీలకు పోటీ ఇచ్చింది.

తాజాగా జీ5 ఓటీటీ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే జీ5 కి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. సౌత్ భాషల్లో కూడా జీ5 లోకల్ కంటెంట్ ని అందచేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా పలు భాషల్లో జీ5 111 సినిమాలు, సిరీస్ లను ప్రకటించింది. వీటిలో సగంకు పైగా జీ5 సొంతంగా నిర్మిస్తుంది. త్వరలోనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జీ5 ఓటీటీలోకి రాబోతున్నాయి. జీ5 చేసిన ఈ ప్రకటనతో మిగిలిన ఓటీటీలు తమ కంటెంట్ పై దృష్టి సారించాయి. మరి జీ5 రిలీజ్ చేసే ఈ సినిమాలు, సిరీస్ లు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.