Kerala: రైలుని రివర్స్‌లో నడిపిన లోకో పైలట్..!
Kerala: ఓ లోకో పైలట్ రైలుని(train) రివర్స్‌లో నడిపాడు. ఈ ఘటన కేరళలో(kerala) చోటుచేసుకుంది. అళపుళ జిల్లాకు(azhappula) చెందిన షోరానూర్‌కు వెళ్లాల్సిన ఓ రైలు.. చెరియనాడ్ స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. కానీ లోకో పైలట్ బ్రేక్ వేయడం మరిచిపోయి 700 మీటర్ల వరకు వెళ్లిపోయాడు. అప్పటికే చెరియనాడ్ స్టేషన్‌లో చాలా మంది ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంది. దాంతో చేసేదేమీ లేక రైలును రివర్స్‌లో నడిపి స్టేషన్‌లో ఆపాడు. అయితే ఈ ఘటన వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకపోవడంతో ప్యాసెంజర్లు కూడా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. చెరియనాడ్ స్టేషన్ దగ్గర సిగ్నల్ కానీ స్టేషన్ మాస్టర్ కానీ లేకపోవడంతో లోకో పైలట్ ఆపకుండా వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిపారు. సాధారణంగా ఒక స్టేషన్ దగ్గర ఆగాల్సిన రైలు పొరపాటుగా ఆగకుండా వెళ్లిపోతే ఇక వేరే స్టేషన్‌లోనే ఆపాలి. అంతే కానీ రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లడానికి వీలుండదు. నిజానికి లోకో పైలట్ చేసింది సాహస చర్యే అని చెప్పాలి. కానీ ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కానీ ప్రమాదం కానీ జరగకపోవడంతో విషయం పై అధికారుల వరకు వెళ్లలేదు.