Viveka Case: అవినాష్‌కు సుప్రీంకోర్టు షాక్.. !
Hyderabad: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు(viveka case) అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash reddy) అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. అయితే అవినాష్ తల్లికి గుండె పోటు రావడంతో ఆయన సీబీఐ విచారణకు హాజరు కాలేదు. దీనిత ఆయ్యని అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ వేకెషన్ బెంచ్ ని అవినాష్ తరపు న్యాయవాదులు అశ్రాయించారు. ఈ నేపథ్యంలో సుప్రీం అవినాష్‌కు షాకిచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడం కుదరదని తీర్పు వెల్లడించింది.
న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిషన్‌ను మెన్షన్ చేసారు. గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ ఉంచారు. ఇక ఆయన పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉండగా.. అవినాష్‌కు సుప్రీం షాకిచ్చింది.