Indian Cricketers: ఈ క్రికెట‌ర్లు మందు జోలికే పోరు..!

Hyderabad: ఇండియ‌న్ క్రికెట‌ర్ల(indian cricketers) ఫిట్నెస్ రెజీమ్ ఎంత క‌ఠినంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటూ మంచి ఫుడ్ తింటూ త‌మ‌ని తాము ఇంకా ఫిట్‌గా మార్చుకుంటారు. అయితే ఎప్పుడో ఒక‌సారి పార్టీల్లో ఎంజాయ్ చేయ‌డానికి త‌మ ఫిట్నెస్ డైట్‌ని ప‌క్క‌న‌బెడ‌తారా అంటే అదీ లేదు. అందులోనూ ఈ క్రికెట‌ర్లు మాత్రం అస‌లు మందు చుక్క(alcohol) జోలికి కూడా పోర‌ట‌. వారెవ‌రంటే..

రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid)
ఇండియ‌న్ క్రికెట్ టీం హెడ్ కోచ్ అయిన రాహుల్ ఆల్క‌హాల్‌కు దూరంగా ఉంటారు. ఆట నుంచి రిటైర్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆల్క‌హాల్ ట‌చ్ చేయ‌రు.

ధోనీ (Dhoni)
41 ఏళ్ల వ‌య‌సులోనూ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఫిట్నెస్ మామూలుగా ఉండ‌దు. ఆయ‌న అసలు పార్టీల్లోనూ ఆల్క‌హాల్‌కి దూరంగా ఉంటారు.

వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ (VVS Laxman)
మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఎన్నో గుర్తుండిపోయే టెస్ట్ క్రికెట్ల‌లో త‌న స‌త్తా చాటారు. ఆయ‌న ఇప్ప‌టికి కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారు.

గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir)  
LSG మెంటార్ గౌత‌మ్ గంభీర్‌ రిటైర్ అయిన‌ప్ప‌టికీ ఆల్క‌హాల్‌ని ట‌చ్ చేయ‌కుండా ఒక క్రికెట‌ర్‌కి ఉండాల్సిన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తున్నారు.

భువ‌నేశ్వ‌ర్ కుమార్ (Bhuvaneshwar kumar)
పేస‌ర్ భువీ స్ట్రిక్ట్ శాకాహారి. మ‌ద్యం జోలికి అస్స‌లు పోడు.

అజింక్య ర‌హానే (Ajinkya Rahane)
ఫాంలో చాలా కాలం పాటు కొన‌సాగాలని క‌ల‌లు కంటున్న ర‌హానే కూడా ఫిట్నెస్ కోస‌మ‌ని ఆల్క‌హాల్ ట‌చ్ చేయ‌డంలేద‌ట.

కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)
ఆల్క‌హాల్‌కి దూరంగా ఉండ‌టం వ‌ల్లే ఫీల్డ్‌లో బాగా పెర్ఫాం చేయ‌గ‌లుగుతున్నా అని కుల్దీప్ అంటుంటాడు.

చెతేశ్వ‌ర్ పుజారా (Cheteshwar Pujara)
ఫీల్డ్‌లోనే కాదు.. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ డిసిప్లైన్ విష‌యంలో పుజారా అశ్రద్ధ‌గా ఉండ‌డు. ఇత‌ను కూడా మందు చుక్క ముట్ట‌డు.

కేదార్ జాద‌వ్ (Kedar Jadhav)
కేదార్ నో ఆల్క‌హాల్ పాల‌సీ అనే ఓ నియ‌మం పెట్టుకున్నాడు. దాని వ‌ల్ల చాలా లాభ‌ప‌డ్డాడు కూడా.

విరాట్ కోహ్లీ (Virat Kohli)
కింగ్ కోహ్లీ ఒక‌ప్పుడు ఆల్క‌హాల్ తాగేవారు. కానీ ఫిట్నెస్ కోస‌మ‌ని పూర్తిగా మానేసాడు.