salaar: ఫ్యాన్స్ టార్చ‌ర్..ట్విట‌ర్ నుంచి డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ ఔట్

Hyderabad: ప్ర‌భాస్(prabhas) న‌టిస్తున్న స‌లార్(salaar) సినిమాపై రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో హోప్ప్ పెట్టుకున్నారు. అందులోనూ కేజీఎఫ్(kgf) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీసిన ప్ర‌శాంత్ నీల్(prashant neel) నుంచి సినిమా అంటే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. అయితే సలార్(salaar) నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక మంచి అప్డేట్ వ‌చ్చింది లేదు. దాంతో ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. అప్డేట్ ఎప్పుడిస్తారు అంటూ ప్ర‌శాంత్ నీల్‌కు, నిర్మాత కిర‌ణ్ కొడంకూరికి ట్విట‌ర్‌లో తెగ మెసేజ్‌లు చేస్తున్నారు. వారి నుంచి ఎలాంటి రిప్లై లేక‌పోయేస‌రికి బూతులు తిడుతున్నారు. దాంతో వారి టార్చ‌ర్ భ‌రించ‌లేక ప్ర‌శాంత్ నీల్, కిర‌ణ్ ట్విట‌ర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ప్ర‌స్తుతం వారి అకౌంట్లు డీయాక్టివేట్ అయ్యాయి. ఫ్యాన్స్ టార్చ‌ర్ భ‌రించ‌లేకే వారు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స‌లార్(salaar) సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.