Vijay 68: మరో సినిమా అనౌన్స్​ చేసిన ఇళయ దళపతి!

Chennai: ఇళయ దళపతి విజయ్(Vijay), సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా లియో(Leo). ఈ సినిమాలో హీరోయిన్​గా త్రిష(Trisha) నటిస్తుండగా, బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్(Sanjay Dutt)​ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మిస్కిన్​, జీవీఎమ్​, ప్రియా ఆనంద్ సహా పలువురు ఈ చిత్రంలో నటించనున్నారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ‘లియో’ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా విజయ్​ తన తదుపరి సినిమా అనౌన్స్​ చేశారు.

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో విజయ్​ ఓ సినిమా చేయనున్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని కన్ఫామ్​ చేశారు విజయ్​. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ కేజ్రీ కాంబినేషన్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్​ చేస్తున్నారు. కాగా, వెంకట్​ ప్రభు ఇటీవల రూపొందించిన కస్టడీ(Custody) సినిమా బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మరి విజయ్​తో ఎలాంటి సినిమా తీయనున్నారో చూడాలి.