Balakrishna: మల్టీస్టారర్​ ఫిక్స్!

Hyderabad: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏడాది నుంచి ఎన్టీఆర్​ శత జయంతి( NTR 100th Birth Anniversary) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమనుంచే కాకుండా కన్నడ పరిశ్రమ నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేదికపై కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Raj Kumar) మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ సర్ శత జయంతి ఉత్సవాలకు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మేము కూడా చెన్నైలోనే పెరిగాము. రోజూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చెన్నైలో ఎన్టీఆర్ ఇంటి మీద నుంచి వెళ్ళేవాళ్ళం. ఎన్టీఆర్ సర్ సీఎం అయ్యాక ఫిలింఫేర్ అవార్డ్స్ హైదరాబాద్ లో జరిగితే సీఎం లా కాకుండా ఒక మాములు నటుడిలా వచ్చే అందరి గెస్టులని ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు, అది ఆయన గొప్పతనం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దానివల్ల చిన్నప్పటి నుంచి నేను, బాలకృష్ణ క్లోజ్ అయ్యాం. ఏజ్ పెరిగే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడుతుంది. బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళం. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాం’అన్నారు. దీంతో బాలయ్య మల్టీస్టారర్​పై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే బాలయ్య ఐదు సినిమాలను లైన్లో పెట్టారు. మరి వాటిలో ఒకటి మల్టీస్టారర్​గా తెరకెక్కనుందా.. లేకపోతే వేరే డైరెక్టర్​తో ఈ సినిమా చేయనున్నారా? అనేది తెలియాలంటే ప్రకటించేవరకు ఆగాల్సిందే.