Twitter: సినిమాలు ట్విట‌ర్లోనే చూసేయొచ్చు..!

Hyderabad: OTTల‌కు డ‌బ్బులు క‌ట్టి సినిమాలు చూసే బ‌దులు ఇక హాయిగా ట్విట‌ర్‌లోనే(twitter) చూసుకోవ‌చ్చు. ఇదంతా ట్విట‌ర్ సీఈఓ ఎలాన్ మ‌స్క్(elon musk) చ‌ల‌వే. మ‌స్క్ ఓ కొత్త ఫీచ‌ర్‌ని తీసుకొచ్చారు. అదేంటంటే.. ట్విట‌ర్ బ్లూ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఏకంగా 2 గంట‌ల వీడియోను అంటే 8జీబీ వీడియోను ట్విట‌ర్‌లో అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. గ‌తంలో ట్విట‌ర్‌లో ఈ ఆప్ష‌న్ లేదు. అయితే ట్విట‌ర్ బ్లూ టిక్ స‌బ్‌స్క్రైబ‌ర్లు అప్‌లోడ్ చేసే వీడియోల‌ను ఇక బ్లూ టిక్(blue tick) లేని యూజ‌ర్లు కూడా చూడ‌చ్చు. దాంతో బ్లూ టిక్ ఉన్న‌వారంతా ఏకంగా సినిమాల‌నే అప్‌లోడ్ చేసేస్తున్నారు. దీని వ‌ల్ల యూట్యూబ్‌పై(youtube) ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఈ మ‌ధ్య‌కాలంలో ఓటీటీల్లో సినిమాలు చూడ‌లేని వారు యూట్యూబ్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన‌వి ఫ్రీగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆప్ష‌న్ ట్విట‌ర్‌లో ఉండ‌టంతో ఇక అంద‌రూ ట్విట‌ర్‌లోనే సినిమాలు చూసేస్తారు. ఇక పైర‌సీ వీడియోల‌ను కూడా అప్‌లోడ్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. పైర‌సీని ఎంకరేజ్ చేయ‌ని వారు అలాంటి వీడియోలు ట్విట‌ర్లో క‌నిపిస్తే వెంట‌నే రిపోర్ట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి. వెంట‌నే ట్విట‌ర్ చ‌ర్య‌లు తీసుకుంటుంది.