Joe Biden: మీ ఆటోగ్రాఫ్ కావాలి మోదీజీ..!
Japan: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden).. భారత ప్రధాని నరేంద్ర మోదీని(modi) ఆటోగ్రాఫ్ అడిగారు. జపాన్‌లోని హీరోషిమాలో జరుగుతున్న G7 సమ్మిట్ మోదీ వెళ్లారు. ఈ మీటింగ్‌కి జో బైడెన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ, బైడెన్ చర్చించుకున్నారు. త్వరలో అమెరికలోని వాషింగ్టన్లో జరగబోయే ఇండియన్ ప్రోగ్సామ్స్కి హాజరుకావాలని చాలా మంది రిక్వెస్ట్‌లు పంపుతున్నారని చెప్పారు. “ఎంతో మంది ప్రజల గుంపును మేనేజ్ చేయగలిగే సత్తా ఉంది మీకు. మీ ఆటోగ్రాఫ్ కావాలి” అని మోదీని కోరారు బైడెన్.
మాటల మధ్యలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీజ్(anthony albanese) కూడా వచ్చారు. సిడ్నీలో 20 వేల మందికి సరిపోయే సామర్ధ్యం ఉన్న కమ్యూనిటీ రిసెప్షన్ ఉందని కానీ తనకు వస్తున్న రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయలేకపోతున్నానని ఆల్బనీస్ మోదీ, బైడెన్‌లతో అన్నారు. జనాల గుంపును మేనేజ్ చేయడంలో తమకున్న సవాళ్ల గురించి బైడెన్,(biden) ఆల్బనీస్(albanese) మోదీతో(modi) చర్చించారు. ఆల్బనీస్ ఇండియా వచ్చినప్పుడు మోదీతో కలిసి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో 90 వేల మంది వచ్చారు. ఈ విషయాన్ని ఆల్బనీస్ మోదీకి గుర్తుచేస్తుండగా.. మీ ఆటోగ్రాఫ్ కావాలి మోదీ సర్ అని బైడెన్ అడగడంతో మోదీ నవ్వుకున్నారు.