NTR 100 years: నాగచైతన్య బాలయ్యకి కౌంటర్​ ఇచ్చారా!?

Hyderabad: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి ఎన్టీఆర్(Nandamuri Taraka Ramarao)​ శత జయంతి ఉత్సవాల(100th Birth Anniversary) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 28న ఎన్టీఆర్(NTR)​ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య(Naga Chaitanya) పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి వెంకటేష్(Venkatesh), రామ్ చరణ్(Ram Charan), నాగచైతన్య(Naga Chaitanya), సుమంత్​, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, పలువురు దర్శకులతోపాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని వారసులు హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ అక్కినేని నాగచైతన్య, అఖిల్ బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకల్లో చైతన్య కనిపించడం, బాలయ్యతో మాట్లాడంతో అక్కినేని, నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బాలకృష్ణ(Balakrishna) గారికి చాలా కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారు నటన, అందం, వాత్సల్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాముడు, శ్రీకృష్ణుడు గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ముందు గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. మా ఇంట్లో తాతగారు ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంతో గౌరవంగా మాట్లాడేవారు’ అని చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య వివాదానికి తెరపడినట్లయింది. అయితో ఒక్క మాటతో చైతన్య బాలయ్యకు గట్టి కౌంటర్​ ఇచ్చాడని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్లు. ఇక ఈ వేడుకకు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​ హాజరు కాకపోవడం చర్చకు దారితీస్తోంది.