Manchu Vishnu: ఈ డ‌బ్బు వెన్నెల కిషోర్ ఇంట్లో చూసా

Hyderabad: మంచు విష్ణు(manchi vishnu) ఓ షాకింగ్ ఫొటోను ట్వీట్ చేసారు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్(vennela kishore) ఇంటికి వెళ్లిన‌ప్పుడు తీసిన ఫొటో ఇది అంటూ రూ.2000 నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డి ఉన్న ఫొటోను పోస్ట్ చేసారు. నేను వెన్నెల కిషోర్(vennela kishore) ఇంటికి వెళ్లిన‌ప్పుడు తీసిన ఫొటో ఇది. పాపం ఈ రూ.2000 నోట్లతో ఏం చేస్తారో..! అని ట్వీట్ చేసారు. దాంతో ఈ పిక్ కాస్తా వైర‌ల్‌గా మారింది. రూ.2000 నోట్ల‌ను విత్‌డ్రా చేసుకుంటున్న‌ట్లు నిన్న ఆర్‌బీఐ(rbi) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విష్ణు ఇలా స‌ర‌దాగా ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

వెన్నెల కిషోర్‌కి మంచు ఫ్యామిలీకి(manchu family) మంచి ర్యాపో ఉంది. వాళ్లింట్లో జ‌రిగే అన్ని వేడుక‌లు, పార్టీల‌కు కిషోర్ వెళ్తుంటాడు. మొన్న మంచు మ‌నోజ్(manchu manoj), భూమా మౌనిక‌ల(bhuma mounika) పెళ్లిలోనూ కిషోర్ సంద‌డి చేసారు. ఇక‌పోతే.. వెన్నెల కిషోర్ ఈ మ‌ధ్య‌కాలంలో చాలా సినిమాల‌ను ఓకే చేసారు. ఈటీవీ నిర్వ‌హిస్తున్న మ‌ళ్లీ మొద‌లైంది(malli modalaindi) షోకి కూడా హోస్ట్‌గా చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో తీసుకున్న రెమ్యున‌రేష‌నే ఈ ఫొటోలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. లేదా.. కావాల‌నే మంచు విష్ణు.. కిషోర్‌ను ఆట‌ప‌ట్టించ‌డానికి ఫేక్ ఫొటో పోస్ట్ చేసారా అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.