Note Withdraw: బ్లాక్‌మనీ నిర్మూలన కోసం కాదా..?!
Hyderabad: డీమానిటైజేషన్(demonitisation) అనేది ప్రధాని మోదీ(modi) తీసుకున్న సంచలనాత్మక, చారిత్రక నిర్ణయం. అప్పటి వరకు చలామనిలో ఉన్న పెద్ద నోట్లు… మరుసటి రోజు నుంచే చెల్లవు అని చెప్పి బాంబ్ పేల్చారు. అయితే దీని వెనుక తమ లక్ష్యం ఏంటి అన్నది కూడా మోదీ స్పష్టం చేశారు. దేశంలో, అదేవిధంగా విదేశాల్లో బ్లాక్ మని పెరిగిపోయిందని, దాన్ని వెనక్కు తెచ్చేందుకు డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. బ్లాక్ మనీ వెనక్కు వస్తే.. దేశంలోని ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షల వరకు వేసే అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు అమిత్‌షా, ప్రధాని మోదీ, తదితరులు చెప్పిన పరిస్థితి ఉంది.
అయితే.. వాస్తవానికి వారు చెప్పిన వాటిల్లో ఏదీ జరగలేదు. పైగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరి.. చేతిలో డబ్బులేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు మోదీపై అభిమానంతో డీమానిటైజేషన్‌కు మద్దతు ఇచ్చారు. తీరా నోట్ల మార్పిడి జరిగిన తర్వాత ఆర్బీఐ లెక్కల ప్రకారం మొత్తం 15 లక్షల కోట్ల వరకు మార్పిడి జరిగిందని పేర్కొంది. అయితే కేవలం పది వేల కోట్లు మాత్రమే జమ కాలేదని అవి బ్లాక్ మనీ అని తేల్చింది. ఇది నిజానికి చాల తక్కువ అమౌంట్ అని చెప్పాలి. విదేశాల్లో ఉన్న వారుసైతం కరెన్సీని మార్చేసుకున్నారు. మరి అలాంటప్పుడు బ్లాక్ మనీ ఎక్కడా కూడా చేజిక్కినట్లు బీజేపీ ప్రకటించలేదు.
నల్లధనం ఉన్నవాడు దొరికిపోతాడు అని చెప్పిన ప్రధాని మోదీ.. డీమానిటైజేషన్ తర్వాత ఎంతమందిని పట్టుకున్నారో ప్రకటించలేదు. బీజేపీ మరోసారి ప్రజల్ని ఏమార్చేందుకు, పొలిటికల్ స్టంట్ కోసమే.. బ్లాక్ మనీ నెరేటివ్‌ను బీజేపీ తీసుకొస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ తెరవెనుక రాజకీయాల్లో భాగంగా నోట్ల వాపస్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నారని పలువురు చెబుతున్నారు.