Tiger Nageswara Rao: రవితేజను బాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేస్తున్న స్టార్ హీరో

Hyderabad: ఈ ఏడాది వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో పవర్​ఫుల్​ పాత్రలో నటించి మెప్పించారు మాస్​ మహారాజ రవితేజ(Raviteja). ఇటీవల విడుదలైన ‘రావణాసుర’(Ravanasura) డిజాస్టర్​గా మిగిలిపోయింది. కాగా, మరో రెండు భారీ ప్రాజెక్ట్స్​తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక, 70ల్లో జరిగిన కథ ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao) బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నారు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్​. అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. చాలా రోజులుగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యండి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు రవితేజ అభిమానులు.
కాగా తాజాగా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ(Vamsee) సోషల్ మీడియాలో రవితేజ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమా టీజర్​ రిలీజ్​ చేస్తామని మాటిచ్చారు. చెప్పినట్టుగానే టైగర్​ నాగేశ్వర రావు ఫస్ట్​లుక్​తోపాటు టీజర్​ని​ మే 24న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. ఇక ఈ పాన్​ ఇండియా సినిమా ఫస్ట్​లుక్​, టీజర్​ హిందీలో బాలీవుడ్(Bollywood)​ నటుడు జాన్​ అబ్రహం(John abraham) వాయిస్​ ఓవర్​తో రానుంది. మాస్​ మహారాజ రవితేజ ఈ సినిమాతో హిందీ మార్కెట్లోనూ అడుగుపెట్టబోతున్నారు. జాన్​ అబ్రహం సపోర్ట్​తో రవితేజకు ఎలాంటి వెల్​కమ్​ లభిస్తుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే!