CM Swearing Ceremony: సిద్ధారామ‌య్య అనే నేను….

Bengaluru: ఈరోజు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా(karnataka cm) సిద్ధారామ‌య్య(siddaramaiah) ప్ర‌మాణ స్వీకారం(cm swearing ceremony) చేయ‌బోతున్నారు. బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టేడియంలో(kanteerava stadium) ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రుగుతోంది. సిద్ధాతో పాటు క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్(dk shivakumar) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వేడుక‌కు కాంగ్రెస్ అగ్ర నేత‌లు ప్రియాంక గాంధీ(priyanka gandhi), రాహుల్ గాంధీ(rahul gandhi) హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్(kamal haasan) కూడా వేడుక‌కు విచ్ఛేసారు. వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు కూడా వ‌చ్చారు. వీరితో పాటు మ‌రో 8 మంది ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం ఉన్న‌ట్లు తెలుస్తోంది.