RBI: రూ.2000 నోటు వెన‌క్కి.. ఈ తేదీలోపు మార్చుకోండి!

Hyderabad: ఇక రూ.2000 చెల్ల‌వ‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) ప్ర‌క‌టించింది. ఆ నోట్ల‌ను ప్ర‌జ‌లు సెప్టెంబ‌ర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న రూ.2000 నోట్ల‌ను లీగ‌ల్ టెండ‌ర్ల‌ను మాత్ర‌మే వాడ‌నున్న‌ట్లు పేర్కొంది. ఇక నుంచి క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.2000 నోటు ఇవ్వొద్ద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్(rbi).. ఇతర బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది. 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రంలోనే రూ.2000 నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసామ‌ని ఆర్‌బీఐ తెలిపింది. దేశం మొత్తంలో 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాల‌యాల్లో 2000 నోట్ల‌ను మార్చుకోవ‌చ్చు. ఒకేసారి రూ.20000 వ‌ర‌కు మాత్ర‌మే రూ.2000 క‌రెన్సీని మార్చుకునే వీలుంది. చిన్న డినామినేష‌న్ల‌లోనే నోట్లు బోలెడు ల‌భిస్తున్నందున రూ.2000 నోటును బ్యాన్ చేస్తున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది.