Samantha: యంగ్​ హీరోతో నెక్ట్స్​ సినిమా!

Hyderabad: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత(Samantha) నటిస్తున్న తాజా చిత్రం ఖుషి(Kushi). శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda), సమంత జంటగా నటిస్తున్నారు. దీంతో పాటు పాపులర్​ వెబ్​ సిరీస్​ సిటాడెల్​ ఇండియన్​ వెర్షన్​ లోనూ నటిస్తోంది సమంత. ఇటీవల రిలీజైన శాకుంతలంతో తన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ డిజాస్టర్​ని అందుకున్న సామ్​ తదుపరి ప్రాజెక్ట్స్​పై దృష్టి పెట్టింది.  కాగా, సమంత తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.  డైరెక్టర్​ నందినీ రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుందట.

జబర్దస్త్‌, ఓ బేబి వంటి సినిమాలతో సామ్‌, నందిని మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే సామ్‌తో ఈ న్యూఏజ్‌ లవ్‌స్టోరీని తెరకెక్కంచనుందట. డీజే టిల్లుతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సిద్దూ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. కాగా నందిని రెడ్డి తాజాగా సిద్ధూను కలిసి ఓ కథ వినిపించిందని టాక్‌. అమ్మాయి కన్నా తక్కువ వయసున్న అబ్బాయి.. వాళ్లిద్దరి మధ్య ప్రేమ.. ఇలా ఏజ్‌గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఓ కథను సిద్ధం చేసిందట.

సిద్ధూ కూడా కథను ఒకే సిట్టింగ్‌లో ఒకే చేశాడట. ఇక ఆయనకు జోడీగా సమంతను ఫిక్స్‌ చేసిందట నందిని రెడ్డి. కాగా, ఈ జంటపై ఇప్పటికే నెట్టింట ట్రోల్స్​ మొదలయ్యాయి. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు లేదా యంగ్​ హీరోలతోనే సమంత నటిస్తోందనీ, అంటే తనకు స్టార్​ హీరోల సినిమాలో ఛాన్స్​ రావట్లేదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.