Adipurush: ‘జై శ్రీరామ్​..’ ఫుల్​ సాంగ్​ వ‌చ్చేసింది..!

Hyderabad: పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన మైథలాజికల్​ మూవీ ఆదిపురుష్(Adipurush)​. ప్రముఖ ఇతిహాసం రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్​(Om Raut) రూపొందించారు. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా కనిపిస్తుండగా బాలీవుడ్​ బ్యూటీ కృతి సనన్​(Kriti Sanon) సీతగా కనిపించనుంది. ఇక రావణుడిగా సైఫ్​ అలీఖాన్(Saif Ali khan)​ నటించారు. అనేక వివాదాలు, విమర్శల మధ్య రూపొందిన ఈ సినిమాని జూన్​ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​.
టీజర్​ రిలీజ్​తో నెగెటివ్​ టాక్​ అందుకుని ట్రోల్స్​ బారిన పడిన చిత్రబృందం సినిమా విడుదల వాయిదా వేసి మరీ గ్రాఫిక్స్​పై దృష్టి పెట్టింది. ఈ శ్రమకు ఫలితంగా ‘జై శ్రీరామ్​’ ప్రోమో, ట్రైలర్ విడుదలతో ఆదిపురుష్​పై చాలావరకు పాజిటివ్​ టాక్​ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలో డైరెక్టర్​ ఓం రౌత్​ వరుస అప్​డేట్లు, పోస్టర్లతో అభిమానులకు సర్​ప్రైజ్​లు ఇస్తున్నారు. తాజాగా ‘జై శ్రీరామ్​’ పూర్తి పాటను రిలీజ్​ చేయబోతున్నట్లు ప్రకటించారు. మే 20న జై శ్రీరామ్​ పూర్తి పాట అందుబాటులోకి రానుంది. ఇక ప్రభాస్​ అభిమానులతోపాటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా జూన్​ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.