Leo: విజయ్ తండ్రిగా సంజయ్..!
Chennai: కోలీవుడ్ స్టార్ విజయ్(Vijay) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో(Leo) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లియో సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని చిత్రబృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్ విజయ్‌కి తండ్రి పాత్రలో కనిపించనున్నారట. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్.. తండ్రికి దూరంగా కాశ్మీర్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంటాడట. అదే టైమ్‌లో లియో జాడను కొనుకున్న విలన్స్.. విజయ్ను అంతమొందించడానికి అక్కడిదాకా వస్తారట. అయితే మాఫియా సామ్రాజ్యంలో కింగ్‌గా ఎదిగి, దేశం మొత్తం వణికిపోయే నాన్న సంజయ్ దత్‌ను వదిలేసి విజయ్ అక్కడికి ఎందుకు వచ్చాడనేది సినిమా కథ అని తెలుస్తోంది.
రెగ్యులర్ కాన్సెప్ట్ అయినా లోకేష్ టేకింగ్, కట్టిపడేసే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మాయ చేస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కమల్‌ను లోకేష్ విక్రమ్‌లో ఏ స్థాయిలో చూపించాడో.. లియోలో అంతకు మించి చూపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు.